Dilip kumar: దిలీప్ కుమార్ ఆరోగ్యం విషయంలో ఆందోళన వద్దు: లీలావతి ఆస్పత్రి

  • న్యూమోనియాతో బాధపడుతున్న దిలీప్ కుమార్
  • ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది
  • దిలీప్ కుమార్ ఆరోగ్యంపై ఆయన భార్య మౌనం

రెండు రోజుల క్రితం న్యూమోనియాతో బాధపడుతూ బాలీవుడ్ ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని ఆయనకు చికిత్సనందిస్తున్న లీలావతి ఆస్పత్రి ప్రకటించింది. దిలీప్ కుమార్ ఆస్పత్రిలో చేరిన విషయాన్ని ఆయన మేనల్లుడు ఫైజల్ ఫరూఖి నిన్న సాయంత్రం వెల్లడించారు. అయితే నిన్న ఆస్పత్రి వద్ద దిలీప్ కుమార్ భార్య సైరా భానుని ఆయన ఆరోగ్య విషయమై మీడియా ప్రశ్నించగా ఆమె మౌనం వహించారు.

తాజాగా ఫైజల్ ట్విట్టర్ ద్వారా దిలీప్ కుమార్ ఆరోగ్య పరిస్థితిని వివరించారు. ‘సైరాగారికి, లీలావతి ఆస్పత్రికి విపరీతంగా ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయి. దయచేసి దిలీప్‌ కుమార్‌ ఆరోగ్య పరిస్థితిపై అడగకండి. వారిని వారి పనులు చేయనివ్వండి. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అన్ని వివరాలనూ నేను దిలీప్‌ కుమార్ ట్విట్టర్ ఖాతాలోనే పోస్ట్‌ చేస్తాను. మీ ప్రార్థనలు, అర్థం చేసుకుంటున్న తీరుకి కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు.

అలాగే ఆస్పత్రి ఉపాధ్యక్షుడు అజయ్‌ కుమార్‌ కూడా ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ... ‘ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ విషయంపై ఆందోళన చెందాల్సిన అవసరం ఏ మాత్రమూ లేదు’ అని తెలిపారు. 

Dilip kumar
Leelavathi Hospital
Saira Bhanu
Fijal Farukhi
Ajay Kumar
  • Loading...

More Telugu News