Chandrababu: మాదిగల్లో పెద్ద మాదిగనని చెప్పుకునే చంద్రబాబుకు ఆ దాడులు కనిపించడం లేదా?: పవన్ కల్యాణ్

  • దెందులూరు ఎమ్మెల్యేపై ఎందుకు చర్యలు తీసుకోరు?
  • ఆయన పనులు తప్పనిపించడం లేదా?
  • చంద్రబాబును ప్రశ్నించిన పవన్

టీడీపీ ఎమ్మెల్యేలు కులాల వారీగా తిడుతూ దాడులు చేస్తున్న సంఘటనలు మాదిగల్లో పెద్దమాదిగనని చెప్పుకునే చంద్రబాబునాయుడుకి కనిపించడం లేదా అని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి బహిరంగసభలో ఈరోజు ఆయన మాట్లాడారు.

గతంలో తాను వైజాగ్ నుంచి వస్తుంటే చంద్రబాబు కటౌట్ ఒకటి చూశానని, ‘మాదిగల్లో నేను పెద్ద మాదిగను’ అని దానిపై ఉందని పవన్ గుర్తుచేసుకున్నారు. కులం పేరు పెట్టి దూషిస్తూ, దాడులకు పాల్పడుతున్న దెందులూరు ఎమ్మెల్యేపై చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? తప్పనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ఎనభై ఐదేళ్ల మహిళను, కానిస్టేబుల్స్ ని, ఎస్ఐలను, ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ను కూడా దెందులూరు రౌడీ ఎమ్మెల్యే కొట్టాడని విమర్శించారు.

‘జనసేన మహిళా సైనికుల ఇళ్లల్లో రాత్రి పూట రాళ్లు వేసే తెలుగుదేశం దుర్మార్గులకు చెబుతున్నాను. తెలుగుదేశం స్థానిక నాయకులందరికీ చెబుతున్నా.. మా మహిళా సైనికుల మీద, నాయకురాళ్ల మీద గానీ, మా జనసేన నాయకుల మీద గానీ దాడులు చేస్తే.. సహించమని' పవన్ హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీని మోసి మోసి భుజాలు అలసిపోయాయని, ఇక చాలనుకున్నానని, అందుకే, 2019 ఎన్నికలకు సిద్ధపడ్డానని చెప్పారు.

Chandrababu
Pawan Kalyan
denduluru
devarapalli
  • Loading...

More Telugu News