Jagan: జగన్, విజయసాయిలది రూ.43 వేల కోట్ల అవినీతి!: కనకమేడల రవీంద్రకుమార్

  • అవినీతి కేసుల్లో మునిగిపోయారు
  • ఎన్నికలవగానే విదేశాలకు పారిపోయేందుకు యత్నం
  • రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్నారు

జగన్‌, విజయసాయిరెడ్డి కలిసి రూ.43వేల కోట్ల మేర అవినీతికి పాల్పడ్డారని నిర్ధారణ జరిగిందని టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్‌ ఆరోపించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ను ఉద్దేశించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అవినీతి కేసుల్లో వైసీపీ నేతలు మునిగిపోయారని ఆరోపించారు.

ఎన్నికలు కాగానే విదేశాలకు పారిపోవడానికి వైసీపీ నేతలు ఇప్పటినుంచే ప్రయత్నిస్తున్నారని రవీంద్ర కుమార్‌ విమర్శించారు. బుందేల్‌ఖండ్‌ మాదిరిగా ప్యాకేజీని ఏపీకి ఇస్తామని చెప్పిన కేంద్రం.. ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటనా చేయలేదన్నారు. కేసుల నుంచి తప్పించుకునేందుకు విజయసాయిరెడ్డి జార్జియా వెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారని రవీంద్ర కుమార్ ఆరోపించారు. కేంద్రంతో కుమ్మక్కైన వైసీపీ మాజీ ఎంపీలు.. ఎన్నికలు రావని తెలిసే రాజీనామాలు చేశారని దుయ్యబట్టారు. బీజేపీ ఎంపీ జీవీఎల్‌, ఆ పార్టీ నేతలు రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్నారని రవీంద్ర కుమార్ విమర్శించారు.

Jagan
Vijayasai Reddy
Ravindra kumar
GVL
BJP
  • Loading...

More Telugu News