Stock Market: నేడు మళ్లీ నష్టాలలో స్టాక్ మార్కెట్లు!

  • ఆటోమొబైల్, ఇంధన షేర్లలో అమ్మకాల వెల్లువ  
  • సెన్సెక్స్ 174.91  పాయింట్ల నష్టం 
  • నిఫ్టీ 47 పాయింట్ల లాస్ 

 నిన్న లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు మళ్లీ నష్టాల బాట పట్టాయి.  ఆటోమొబైల్, ఇంధన, ఎఫ్ఎం సీజీ రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో మార్కెట్లు డీలా పడ్డాయి. దీంతో సెన్సెక్స్ 174.91  పాయింట్లు కోల్పోయి 34299.47 వద్ద, నిఫ్టీ 47 పాయింట్లు కోల్పోయి 10301.05 వద్ద ముగిశాయి.

సెన్సెక్స్ సూచికలోని 30 షేర్లలో 14 కంపెనీల షేర్లు నష్టపోగా,  వీటిలో టాటా మోటార్స్, భారతీ ఎయిర్ టెల్, మారుతి, హిందూస్తాన్ అన్ లీవర్, ఏషియన్ పెయింట్స్, రిలయన్స్ సంస్థల షేర్లు అత్యధికంగా నష్టాలను చవిచూశాయి. ఇక అదానీ పోర్ట్స్, వేదాంత, డాక్టర్ రెడ్డీస్ తదితర షేర్లు లాభాలు పండించుకున్నాయి.  

  • Loading...

More Telugu News