idiocrcy: ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలోకి కొత్త పదాలు.. 'ఇడియోక్రసీ'కి కూడా చోటు!

  • ఏడాదికి నాలుగు సార్లు సవరణలు 
  • 1967లో వెలుగులోకి వచ్చిన పదం
  • 2006లో దీనిపై ఓ సినిమా

దాదాపు అరవై ఏళ్ల క్రితం వెలుగు చూసిన ‘ఇడియోక్రసీ’ అనే పదాన్ని ఆక్స్‌ఫర్డ్‌
డిక్షనరీలో చేర్చారు. తాజాగా 1400 కొత్త పదాలను చేర్చాలనుకోగా అందులో ‘ఇడియోక్రసీ’కి కూడా చోటు దక్కింది.

‘ఇడియోక్రసీ’ అంటే అజ్ఞానులు, మూర్ఖులతో కూడిన సమూహం అనీ, అలాంటి ప్రభుత్వం అని అర్థం. 1967లో ఈ పదం వెలుగులోకి వచ్చింది. ఈ పదం అర్థాన్ని ప్రతిబింబించేలా 2006లో ఓ సినిమా కూడా వచ్చింది. ‘ఇడియోక్రసీ’తోపాటు ఈసారి ఫిలిప్సైన్స్‌కు చెందిన ‘ట్రాపో’ అనే పదాన్ని కూడా చేర్చారు. అధికారం చలాయిస్తున్న అవినీతిపరుడైన వ్యక్తి అనే అర్థంలో దీనిని ప్రయోగిస్తుంటారు. పోతే, ఏటా నాలుగుసార్లు ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో సవరణలు చేస్తూ కొత్త పదాలను చేరుస్తుంటారు. 

  • Loading...

More Telugu News