aravinda sametha: 'అరవింద సమేత' ప్రత్యేక షోలకు అనుమతించిన ఏపీ ప్రభుత్వం

  • ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో భారీ చిత్రం 
  • అక్టోబర్ 11 నుంచి 18 వరకు రోజుకు ఆరు షోలు
  • ఉదయం 5- 11 గంటల మధ్యలో రెండు ప్రత్యేక షోలు

జూనియర్ ఎన్టీఆర్, పూజా హెగ్డే, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందిన 'అరవింద సమేత' చిత్రం ఈనెల 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, ఈ చిత్రం ప్రత్యేక షోలను ప్రదర్శించేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతించింది. అక్టోబర్ 11 నుంచి 18 వరకు రోజుకు ఆరు షోలను ప్రదర్శించనున్నారు.

 ఉదయం 5 గంటల నుంచి 11 గంటల మధ్యలో రెండు ప్రత్యేక షోలను వేయనున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కించడమే కాకుండా, దసరా సెలవులు కూడా ఉన్న నేపథ్యంలో ప్రత్యేక షోలకు అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరామని... తమ విన్నపం పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ చిత్రంలో జగపతిబాబు, నాగబాబు, నవీన్ చంద్ర, రావు రమేష్, ఈషా రెబ్బాలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

aravinda sametha
junior ntr
pooja hegde
tollywood
  • Loading...

More Telugu News