సన్నీలియోన్ కు వ్యతిరేకంగా బెంగళూరులో నిరసనలు
- వీర మహాదేవి పాత్రను పోషిస్తున్న సన్నీలియోన్
- మహాదేవిని కన్నడిగులు వీరనారిగా కొలుస్తారు
- నీలి చిత్రాల్లో నటించిన సన్నీ ఈ పాత్రను పోషిస్తుండటంపై కన్నడిగుల ఆగ్రహం
ఈ సందర్భంగా కన్నడ సంఘాల నేతలు మాట్లాడుతూ, 'అమోఘవర్ష నృపతుంగ' కథ ఆధారంగా రూ. 100 కోట్ల బడ్జెట్ తో కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని చెప్పారు. నీలి చిత్రాల్లో నటించిన సన్నీలియోన్ ఈ పాత్రను పోషించడం దారుణమని అన్నారు. ఈ సినిమా షూటింగ్ ను వెంటనే నిలిపి వేయాలని డిమాండ్ చేశారు.