Pawan Kalyan: ప్రత్యేక పడవలో గోదావరి తీరాన్ని పరిశీలించిన పవన్ కల్యాణ్.. ఫొటోలు ఇవిగో!

  • ‘గోదావ‌రి’లో నుంచే ‘ప‌ట్టిసీమ’ పరిశీలన
  • ప్రాజెక్టు వివ‌రాలు తెలుసుకున్న వైనం
  • ఇసుక తెన్నెల‌పై నడిచిన పవన్ కల్యాణ్

పోల‌వ‌రం వ‌ద్ద‌ గోదావ‌రి తీరాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పరిశీలించారు. జనసేన పోరాట యాత్రలో భాగంగా పోల‌వ‌రం ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ప‌వ‌న్‌ ఈరోజు గోదావ‌రి తీరం వెంబడి పరిశీలన చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పడవలో ప్ర‌యాణించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్త‌య్యాక జీవ‌న‌ది రూపు రేఖ‌లు ఎలా మార‌నున్నాయి అనే అంశంపై ఆయన అధ్య‌య‌నం కొన‌సాగింది.

గోదావ‌రిలో నుంచే ప‌ట్టిసీమ ప్రాజెక్టుని ప‌రిశీలించారు. ప్రాజెక్టు గురించి స్థానిక నేత‌ల‌ని అడిగి వివ‌రాలు తెలుసుకున్నారు. గోదావ‌రి ప్ర‌వాహ ఉద్ధృతిని పరిశీలించారు. అనంత‌రం, గోదావ‌రి మ‌ధ్య‌లో ఇసుక తెన్నెల‌ను పరిశీలించిన పవన్, సుమారు కిలోమీట‌రు మేర న‌డిచారు. ఈ సందర్భంగా స్థానిక ‘జ‌న‌సేన’ నేత‌ల వ‌ద్ద‌ ప‌లు ఆస‌క్తిక‌ర‌ అంశాల‌ను ప్రస్తావించారు.
అక్రమ ఇసుక తవ్వకాలు, మాఫియా ఆగడాలపై పవన్ మాట్లాడారు. ఇసుక మాఫియా నుంచి నదిని ఎలా కాపాడాలి? అడ్డగోలు తవ్వకాల మూలంగా పర్యావరణం ఏ విధంగా దెబ్బ తింటుంది? అనే అంశాలపై చర్చించారు. ఇసుక దోపిడిని అడ్డుకునేందుకు ప్ర‌త్యేక‌మైన ప్రణాళికలు రూప‌క‌ల్ప‌న చేయాల్సిన అవసరం ఉందని పవన్ అభిప్రాయ‌ప‌డ్డారు.

  • Loading...

More Telugu News