vimalakka: పోస్టర్ల చించివేతపై ఈసీని ఆశ్రయించిన విమలక్క

  • ప్రతి ఏటా బహుజన బతుకమ్మ జరుపుతాం
  • పోస్టర్లను చించి వేయడం బాధాకరం
  • ఏ పార్టీకి మద్దతు తెలపడం లేదు

తాము కష్టపడి ప్రింట్ చేయించిన బహుజన బతుకమ్మ పోస్టర్లను చించివేయడంపై ప్రజా ఉద్యమ నాయకురాలు విమలక్క ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో తాము ప్రతి ఏటా బహుజన బతుకమ్మను జరుపుతామని ఈసీకి విమలక్క వివరించారు. తెలంగాణ ఉద్యమంలో ముందుండి పాటలతో తెలంగాణను సాధించామని ఆమె పేర్కొన్నారు.

ఈ సంవత్సరం కూడా అదే మాదిరిగా నిర్వహిస్తున్నామని, కానీ పోస్టర్లను చించి వేయడం బాధాకరం అని ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో విమలక్క పేర్కొన్నారు. తమ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఏ పార్టీకి మద్దతు తెలపడం లేదని ఆమె స్పష్టం చేశారు. తాము ఎన్నికల వ్యవస్థకు దూరం అని చెప్పారు. తమ పోస్టర్ల చించివేతను వెంటనే నిలిపివేయాలని ఈసీని విమలక్క కోరారు.

vimalakka
Bahujana bathukamma
posters
election commission
  • Loading...

More Telugu News