indigo: ఈ నెల 25 నుంచి విజయవాడ- సింగపూర్ మధ్య ‘ఇండిగో’ సర్వీసులు నడపాలి: అధికారులతో చంద్రబాబు

  • మౌలికవసతులు లేవని వాదన
  • ఏఏఐ, కస్టమ్స్ అధికారులతో చంద్రబాబు చర్చ
  • కొర్రీలు పెడుతుండటంపై బాబు ఆగ్రహం

ఈ నెల 25 నుంచి విజయవాడ- సింగపూర్ మధ్య ఇండిగో విమాన సర్వీసులు నడపాలని సంబంధిత అధికారులను ఏపీ సీఎం చంద్రబాబు కోరారు. విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసుల నిర్వహణకు ఉన్న అడ్డంకులపై చంద్రబాబు చర్చించారు. మౌలికవసతులు లేవని కస్టమ్స్ అధికారులతో విమానాశ్రయ అధికారులు వాదిస్తున్నారు.

ఈ నేపథ్యంలో సమస్య పరిష్కరించేందుకు గాను ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), కస్టమ్స్ అధికారులతో చంద్రబాబు ఈరోజు చర్చించారు. ఇప్పటికే రూ.18 కోట్లు నిధుల ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకొచ్చిందని, అయినా విమాన సర్వీసులకు అనుమతివ్వకుండా అధికారులు కొర్రీలు పెడుతుండటంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ వివాదంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి, విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభుకు లేఖలు రాయాలని చంద్రబాబు నిర్ణయించినట్టు తెలుస్తోంది. సురేష్ ప్రభుతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరిస్తానని చంద్రబాబు అన్నారు.

  • Loading...

More Telugu News