Balakrishna: బాలకృష్ణ వివరాలు తప్పుగా చూపించిన ‘వికీ పీడియా’
- బాలకృష్ణ జన్మించిన సంవత్సరం 1913ట!
- అర్సికెరేలో బాలయ్య పుట్టినట్టు పేర్కొంది
- బాలయ్య అభిమానులు చెప్పడంతో సరిదిద్దిన ‘వికీపీడియా’
ఏపీ టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ వివరాలను ఫ్రీ ఆన్ లైన్ ఎన్ సైక్లోపీడియా వికీపీడియా తప్పుగా చూపించింది. బాలకృష్ణ జన్మించిన సంవత్సరం 1960. అయితే, 1913, నవంబర్ 2లో అర్సికెరేలో బాలయ్య జన్మించినట్టు ఇందులో పేర్కొంది. అంతేకాకుండా, 1995 జులై 19న బెంగళూరులో బాలకృష్ణ మృతి చెందినట్టు రాసింది.
దీంతో, ఇది వైరల్ కావడంతో బాలయ్య అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆకతాయి చేసిన పని అయిఉండొచ్చని వారు అనుమానించారు. ఈ విషయాన్ని ‘వికీపీడియా’ ప్రతినిధులకు బాలయ్య అభిమానులు తెలియజేయడంతో ఆ తప్పును సరిదిద్దారు. బాలయ్యకు సంబంధించిన సరైన వివరాలను అప్ డేట్ చేశారు. కాగా, గతంలో కూడా ‘వికీపీడియా’లో ప్రముఖులకు సంబంధించిన వివరాలు తప్పుగా రాయడం, ఒకరి ఫొటో స్థానంలో మరొకరి ఫొటో ఉంచిన సంఘటనలు లేకపోలేదు.