KTR: అభివృద్ధి పథాన నవ తెలంగాణ...వృద్ధి రేటే ఇందుకు సాక్ష్యం : కేటీఆర్‌

  • నాలుగేళ్లలో 17.7 శాతం అభివృద్ధి
  • సంక్షేమ పథకాల కోసం రూ.45 వేల కోట్లు ఖర్చు
  • గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాల పెంపే లక్ష్యం

నవ తెలంగాణ అభివృద్ధి పథాన ప్రయాణిస్తోందని, గడిచిన నాలుగేళ్ల కాలంలో  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి ఇందుకు నిదర్శనమని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్స్‌ సోషల్‌ స్టడీస్‌ (సెస్‌)లో 'సమీకృత అభివృద్ధి, సమస్యలు...సవాళ్లు’ అనే అంశంపై హైదరాబాదులో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సుకు కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. సంక్షేమ పథకాల అమలు కోసమే 45 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు. ప్రజా సంక్షేమమే నిజమైన అభివృద్ధి అని, సామాజికాభివృద్ధిలో భాగంగానే సంక్షేమ రథాన్ని పరుగులు పెట్టిస్తున్నామని చెప్పారు.

పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, రైతుబంధు పథకాలు ఇందులో భాగమేనని చెప్పుకొచ్చారు.  సమర్థవంతంగా నిధుల వ్యయం ద్వారా 17.7 శాతం వృద్ధి రేటును నమోదు చేయగలిగామని తెలిపారు. తొలుత సెస్ చైర్మన్ రాధాకృష్ణ రచించిన ఇండియన్ ఎకానమీ పుస్తకాన్ని కేటీఆర్ ఆవిష్కరించారు.

  • Loading...

More Telugu News