vijayashanthi: కేసీఆర్, నేను సమఉజ్జీలం.. మహాకూటమిలో టీడీపీ కలవడాన్ని నేను వ్యతిరేకించలేదు: విజయశాంతి

  • కేటీఆర్, కవితలు పిల్లలు
  • టీఆర్ఎస్ లో ఇతరులు ఎదగడాన్ని కేసీఆర్ భరించలేరు
  • కాంగ్రెస్ గెలిచాక నా రాజకీయ భవిష్యత్తు ఏమిటో తెలుస్తుంది

మహాకూటమిలో టీడీపీ కలవడాన్ని తాను వ్యతిరేకించలేదని... కాకపోతే, సమీకరణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిచాక ముఖ్యమంత్రి ఎవరనే విషయాన్ని రాహుల్ గాంధీ నిర్ణయిస్తారని చెప్పారు. తన రాజకీయ భవిష్యత్తు ఏంటనేది కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత తెలుస్తుందని తెలిపారు.

తెలంగాణ సాధనలో తనకు 100 మార్కులు పడ్డాయని అన్నారు. స్టార్ క్యాంపెయినర్ బాధ్యత బరువైంది కాదని చెప్పారు. టీఆర్ఎస్ లో ఏ నాయకుడైనా ఎదగడాన్ని కేసీఆర్ భరించలేరని... పార్టీ నుంచి తనను ఎందుకు బయటకు పంపారో కూడా ఇంత వరకు చెప్పలేదని విమర్శించారు. తాను, కేసీఆర్ లు సమఉజ్జీలమని... కేటీఆర్, కవితలు పిల్లలని చెప్పారు. 

vijayashanthi
congress
kcr
KTR
kavitha
TRS
Telugudesam
  • Loading...

More Telugu News