matthew hayden: తల బోటుకు ఢీకొని గాయపడ్డ మాథ్యూ హెడెన్

  • కుటుంబంతో కలసి క్వీన్స్ ల్యాండ్ కు హాలిడే ట్రిప్ కు వెళ్లిన హెడెన్
  • సర్ఫింగ్ చేస్తూ పట్టుకోల్పోయిన వైనం
  • తలకు, మెడకు గాయాలు

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మథ్యూ హెడెన్ ప్రమాదానికి గురయ్యాడు. తన కుటుంబంతో కలసి క్వీన్స్ ల్యాండ్ హాలిడే ట్రిప్ కు వెళ్లిన హెడెన్... అక్కడున్న స్ట్రాడ్ బ్రోక్ ఐస్ ల్యాండ్ లో తన కొడుకుతో కలసి సరదాగా సర్ఫింగ్ చేశాడు. ఈ సందర్భంగా పట్టుకోల్పోయాడు. ఈ ప్రమాదంలో ఆయన తల బోటును బలంగా ఢీకొనడంతో... తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే అతన్ని కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి మెరుగ్గా ఉంది.

ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా హెడెన్ స్వయంగా తెలిపాడు. తన తల, మెడకు గాయాలయ్యాయని... మెడలోని సీ6, సీ4 లెగ్మెంట్స్ విరిగినట్టు డాక్టర్లు తెలిపారని వెల్లడించాడు. 2008లో భారత్ తో చివరి టెస్టును, 2009లో దక్షిణాఫ్రికాతో చివరి వన్డేను హెడెన్ ఆడాడు. ఆస్ట్రేలియా తరపున 103 వన్డేలు, 161 టెస్టులు ఆడాడు.

matthew hayden
australia
cricketer
injury
queensland
surfing
  • Loading...

More Telugu News