Venkaiah Naidu: కుల, మతాలను రెచ్చగొట్టే సంఘ విద్రోహులు పెరిగారు: వెంకయ్యనాయుడు

  • పోలీసులంటే చెడు అభిప్రాయం ఉంది
  • వృత్తిరీత్యా కఠినంగా ఉండక తప్పదు
  • బుల్లెట్ ద్వారా ఏదీ సాధించలేము

సమాజంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారి సంఖ్య పెరుగుతోందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. మంగళగిరి పోలీస్ హెడ్‌క్వార్టర్‌లో వనం-మనం మొక్కలు నాటిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలీసులు అంటే సమాజంలో చెడు అభిప్రాయం ఉంది..కానీ ..వృత్తిరీత్యా వారు కొంత కఠినంగా ఉండక తప్పదన్నారు.

కుల, మతాలను రెచ్చగొట్టే సంఘ విద్రోహులు పెరిగారని పేర్కొన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారి సంఖ్య పెరిగిందని.. బుల్లెట్‌ ద్వారా ఏదీ సాధించలేమన్నది అందరూ గుర్తించాలని వెంకయ్యనాయుడు తెలిపారు. ఆంధ్రా పోలీసంటే దేశంలోనే మంచి పేరుందని ఆయన కొనియాడారు.

Venkaiah Naidu
mangalagiri
police head quarter
  • Loading...

More Telugu News