Mavoists: టీఆర్ఎస్, బీజేపీ నేతలను టార్గెట్ చేయనున్న మావోలు?

  • ఎన్నికల్లో మావోయిస్టులు దాడులు చేసే అవకాశం
  • ఇంటెలిజెన్స్ రిపోర్ట్‌తో హైఅలెర్ట్
  • అప్రమత్తమైన పోలీస్ శాఖ
  • కాంగ్రెస్‌పై సానుకూలంగా మావోలు

ఇటీవల ఏపీలోని అరకులో జరిగిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల దారుణ హత్యతో తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. తాజాగా తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో మావోయిస్టులు దాడులు చేసే అవకాశముందని ఇంటెలిజెన్స్ వర్గాలు స్పష్టం చేయడంతో తెలంగాణలో ఒక్కసారిగా హై అలెర్ట్ ప్రకటించారు.

ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహంపై ఛత్తీస్‌గఢ్, సుక్మా దండకారణ్యంలో 2 నెలలుగా మావోయిస్టులు కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. టీఆర్ఎస్, బీజేపీ నేతలను మావోయిస్టులు టార్గెట్ చేసే అవకాశముందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్. దీంతో ఎన్ఐఏ హై అలెర్ట్ ప్రకటించింది. తెలంగాణ పోలీస్ శాఖ కూడా అప్రమత్తమైంది. పోలీసులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ డీజీపీ ఆదేశాలు జారీచేయడం జరిగింది. అయితే కాంగ్రెస్‌పై మాత్రం మావోయిస్టులు సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది.  

  • Loading...

More Telugu News