varalakshmi sharath kumar: ఆ వార్తలు అవాస్తవం.. ఇప్పట్లో పెళ్లి చేసుకోను: నటి వరలక్ష్మి శరత్ కుమార్

  • విశాల్ తో పెళ్లంటూ వస్తున్న వదంతులపై ఖండన
  • నిశ్చితార్థం జరగలేదూ.. పెళ్లీ చేసుకోవడం లేదు
  • ప్రస్తుతం నా దృష్టంతా కెరీర్ పైనే ఉంది

సినీ తారలపై వదంతులు వస్తుండటం.. వాటిని ఆధారంగా చేసుకుని సామాజిక మాధ్యమాల్లో మరిన్ని వ్యాఖ్యలు రావడం చూస్తుంటాం. తమిళ హీరో విశాల్, నటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రేమలో పడ్డారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనీ కొన్నాళ్లుగా వదంతులు వినిపిస్తున్నాయి. దీనిపై వరలక్ష్మి శరత్ కుమార్ స్పందించింది.

ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం తనకు లేదంటూ ఓ ట్వీట్ చేసింది. తనకు నిశ్చితార్థం జరగలేదూ.. పెళ్లీ చేసుకోవడం లేదని స్పష్టం చేసింది. చిత్ర పరిశ్రమలో ఇలాంటి వదంతులు సృష్టించి, తనను కిందకు లాగాలని చూస్తున్న వారందరికి తన ధన్యవాదాలంటూ సెటైర్లు వేసింది. ప్రస్తుతం తన దృష్టంతా కెరీర్ పైనే ఉందని.. తన కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుందని చెప్పింది. ‘పందెంకోడి-2’, ‘మారి 2’, ‘సర్కార్’, ‘శక్తి’, ‘నీయ 2’ చిత్రాల్లో వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తోంది.

   

varalakshmi sharath kumar
vishal
  • Loading...

More Telugu News