Chandrababu: ఏపీలో ఐటీ రైడ్స్ జరుగుతుంటే చంద్రబాబు శివాలెత్తిపోతున్నారు: వైఎస్ జగన్

  • తీగ లాగితే.. డొంక కదులుతుందని బాబుకు భయం
  • చంద్రబాబును ఎల్లో మీడియా భుజాన మోస్తోంది
  • బాబు ఏది చెబితే అదే ఎల్లో మీడియా చేస్తుంది

ఏపీలో ఐటీ రైడ్స్ జరుగుతుంటే చంద్రబాబు శివాలెత్తిపోతున్నారని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి నియోజకవర్గంలో ఉన్న గుర్లలో జరుగుతున్న బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, తీగ లాగితే.. డొంక కదులుతుందని చంద్రబాబుకు భయమని, దోచేసిన రూ.4 లక్షల కోట్లు బయటపడతాయని చంద్రబాబు భయపడుతున్నారని ఆరోపించారు.

చంద్రబాబును ఎల్లో మీడియా భుజాన మోస్తోందని, కేంద్రం, రాష్ట్రం మధ్య దీనిని యుద్ధంగా చిత్రీకరిస్తోందని దుయ్యబట్టారు. చంద్రబాబు ఏది చెబితే అదే ఎల్లో మీడియా చేస్తుందని, ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేసినా, విచ్చలవిడిగా అవినీతి జరుగుతున్నా ఎల్లో మీడియాకు తప్పుగా అనిపించ లేదని మండిపడ్డారు. 21 లోక్ సభ స్థానాల్లో వైసీపీ గెలుస్తుందన్న సీ-ఓటర్ సర్వే కూడా ఎల్లో మీడియాకు కనిపించదని అన్నారు.

Chandrababu
ys jagan
vijayanagaram
  • Loading...

More Telugu News