Petrol: నేడూ పెరిగిన పెట్రో ధరలు!
- పరుగాపని పెట్రో ధరలు
- పెట్రోలుపై 14 పైసలు, డీజిల్‌పై 29 పైసలు పెరుగుదల
- ముంబైలో లీటరు పెట్రోలు ధర రూ.87.29
పెట్రో ధరలు పరుగు ఆపడం లేదు. సెంచరీ దిశగా పరుగులు తీస్తున్నాయి. చమురు కంపెనీలు ఆదివారం కూడా పెట్రోలు, డీజిల్ ధరలను పెంచేశాయి. ఢిల్లీలో లీటరు పెట్రోలుపై 14 పైసలు, డిజిల్‌పై 29 పైసలు పెంచాయి. ఫలితంగా లీటరు పెట్రోలు ధర రూ.81.82కు చేరుకోగా, డీజిల్ ధర రూ.73.53కి చేరుకుంది. ముంబైలో పెట్రోలుపై 14 పైసలు, డీజిలుపై 31 పైసలు పెరిగింది. పెరిగిన ధరలతో ముంబైలో లీటరు పెట్రోలు ధర రూ.87.29కు చేరుకుని వంద దిశగా పరుగులు తీస్తుండగా డీజిల్ రూ.77.06కు చేరుకుంది.
ఈనెల 4న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పెట్రోలు, డీజిల్‌పై సుంకాన్ని లీటర్‌కు రూ.2.50 తగ్గించారు. ఆయన ప్రకటన తర్వాత మరికొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా సుంకాన్ని తగ్గించాయి. అయితే, సుంకాన్ని తగ్గించినప్పటికీ ధరల పెరుగుదల మాత్రం ఆగకపోవడం వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తోంది.