Pooja: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • ప్రభాస్ షూటింగులో జాయిన్ అయిన పూజ
  • హీరోగా ప్రముఖ నిర్మాత తనయుడు
  • నాని హీరోగా గీతా ఆర్ట్స్ చిత్రం  

*  ఓ పక్క 'సాహో' సినిమా చేస్తూనే, మరోపక్క రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ మరో చిత్రాన్ని చేస్తున్నాడు. రొమాంటిక్ పిరీడ్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ గత కొన్ని రోజులుగా ఇటలీలో జరుగుతోంది. తాజాగా ఈ చిత్రం షూటింగులో కథానాయిక పూజా హెగ్డే కూడా జాయిన్ అయింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని గోపీ కృష్ణా మూవీస్ తో కలసి యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.
*  'పెళ్లి చూపులు' చిత్రంతో నిర్మాతగా వెలుగులోకి వచ్చిన రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి హీరోగా పరిచయం అవుతున్నాడు. 'జయమ్ము నిశ్చయమ్మురా' ఫేం శివరాజ్ కనుమూరి దర్శకత్వంలో రూపొందే చిత్రంలో శివ కందుకూరి హీరోగా నటిస్తాడు. ఈ చిత్రాన్ని రాజ్ కందుకూరి నిర్మిస్తారు.
*  'బ్రహ్మోత్సవం' చిత్రం పరాజయం కావడంతో గ్యాప్ తీసుకున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఇప్పుడు గీతా ఆర్ట్స్ సంస్థలో ఓ చిత్రాన్ని చేయబోతున్నాడు. ఇందులో నాని హీరోగా నటిస్తాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

  • Loading...

More Telugu News