Pawan Kalyan: ఈ దెబ్బతో జనసేన సత్తా దేశమంతా తెలియాలి.. దద్దరిల్లిపోవాలంతే: పవన్ కల్యాణ్

  • 15న ధవళేశ్వరం బ్యారేజీపై జనసేన కవాతు
  • దేశం మొత్తం చర్చించుకోవాలన్న జనసేనాని
  • ఆవేదనతో రాజకీయాల్లోకి వచ్చానన్న పవన్

ఈ నెల 15న ధవళేశ్వరం బ్యారేజీపై చేపట్టనున్న కవాతుతో దేశం మొత్తం జనసేన గురించి చర్చించుకోవాలని, దెబ్బకు దద్దరిల్లిపోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.  తూర్పుగోదావరి జిల్లా నాయకులు, కార్యకర్తలతో శనివారం భేటీ అయిన పవన్ కల్యాణ్ మాట్లాడుతూ కవాతుతో జనసేన సత్తా ఏంటో దేశమంతా తెలియజేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఒక లక్ష్యంతో కవాతు నిర్వహిస్తున్నామని, దేశమంతా దీని గురించి మాట్లాడేలా చేయాలని అన్నారు. ఇందుకోసం తాను చేయాల్సింది చేస్తానని, మీరు చేయాల్సింది మీరు చేయాలని కార్యకర్తలకు చెప్పారు. తాను రాజకీయాల్లోకి ఎంతో ఆవేదనతో, బాధతో సమస్యలపై పోరాడాలనే ఉద్దేశంతోనే వచ్చానని పేర్కొన్నారు.

Pawan Kalyan
Dhavaleshwaram
Jana sena
Kavatu
East Godavari District
  • Loading...

More Telugu News