gaali muddu krishnama: గాలి ముద్దుకృష్ణమ కుమారుల మధ్య సయోధ్యకు చంద్రబాబు యత్నం!

  • నగరి ఇన్‌చార్జి పదవి కోసం పట్టు
  • ఒకరికి ఇస్తానని హామీ
  • ఆ ఒక్కరు ఎవరో తేల్చుకోవాలని ఆదేశం

టీడీపీ నేత దివంగత గాలి ముద్దుకృష్ణమనాయుడు ఇద్దరు కుమారుల మధ్య ఏపీ సీఎం చంద్రబాబు సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు. నగరి ఇన్‌చార్జి పదవి కోసం ముద్దుకృష్ణమ కుమారులు జగదీష్, భాను పట్టుబడుతున్నారు. దీంతో నగరి టీడీపీ నేతలు, ముద్దుకృష్ణమ భార్య ఎమ్మెల్సీ సరస్వతి, కుమారులతో నేడు చంద్రబాబు సమావేశమయ్యారు.

ముద్దుకృష్ణమ ఇద్దరు కుమారుల్లో ఒకరికి నగరి ఇన్‌చార్జి బాధ్యత అప్పగిస్తానని.. ఇద్దరిలో ఎవరు ఉంటారో తేల్చుకుని రెండు రోజుల్లోగా తనకు చెప్పాలని ఆదేశించారు. లేదంటే ఇన్‌చార్జి బాధ్యతలు మరొకరికి అప్పగించాల్సి ఉంటుందని చంద్రబాబు వారికి స్పష్టం చేశారు.

gaali muddu krishnama
Chandrababu
saraswathi
jagadish
bhanu
  • Loading...

More Telugu News