shivaraj kumar: కాలేజ్ లెక్చరర్ గా ఈషా రెబ్బా!

  • చిన్న సినిమాలు చేస్తూ వచ్చిన ఈషా రెబ్బా 
  • 'అరవింద'లో రెండో నాయికగా పెద్ద ఛాన్స్ 
  • కన్నడలోను హీరోయిన్ గా అవకాశం

తెలుగు తెరకి పరిచయమై కొంతకాలమైనప్పటికీ, ఈషా రెబ్బా ఇప్పుడిప్పుడే కుదురుకుంటోంది. ఆకర్షణీయమైన రూపం .. అందుకు తగిన అభినయం కారణంగా యూత్ లో ఆమె పట్ల క్రేజ్ పెరుగుతూ వస్తోంది. దాంతో ఆమెను వెతుక్కుంటూ ఒక్కో అవకాశం వస్తోంది. 'అమీ తుమీ' .. 'అ!' సినిమాలు ఆమెకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇక ఇటీవల వచ్చిన 'బ్రాండ్ బాబు' సక్సెస్ ను సాధించకపోయినా, నటన పరంగా ఆమెకి మంచి మార్కులు పడ్డాయి.

చిన్న చిన్న సినిమాలతోనే కెరియర్ ను నెట్టుకొస్తోన్న ఆమె, 'అరవింద సమేత'లో రెండో కథానాయికగా చేయడం విశేషం. ఈ సినిమా ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, కన్నడలో హీరోయిన్ గాను ఛాన్స్ కొట్టేసింది. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ సరసన కథానాయికగా ఆమె నటించనుంది. ఈ సినిమాలో ఆమె కాలేజ్ లెక్చరర్ గా కనిపించనుందట. ఈ నెల చివరివారం నుంచి ఈ సినిమా షూటింగులో ఆమె జాయిన్ కానుంది. ఈ రెండు సినిమాలతో ఈషా రెబ్బా మరింత బిజీ అవుతుందేమో చూడాలి.     

shivaraj kumar
eesha rebbah
  • Loading...

More Telugu News