babli project: బాబ్లీ కేసు.. ధర్మాబాద్ కోర్టు విచారణకు వెళ్లకూడదని చంద్రబాబు నిర్ణయం!

  • అమరావతిలో పార్టీ నేతలతో సమావేశం
  • రీకాల్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయం
  • బాబ్లీ ఆందోళన కేసులో బాబుకు ఎన్ బీ డబ్ల్యూ జారీచేసిన కోర్టు

బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతరేకంగా ఆందోళన చేసిన కేసులో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 15న చంద్రబాబు సహా 16 మంది విచారణకు హాజరుకావాల్సి ఉంది. టీడీపీ ముఖ్యనేతలతో ఈ రోజు సమావేశమైన చంద్రబాబు ఈ విషయమై కీలక నిర్ణయం తీసుకున్నారు.

తొలుత పార్టీ కార్యకర్తలు, నేతలతో కలిసి ర్యాలీగా ధర్మాబాద్ కోర్టుకు వెళ్లాలని చంద్రబాబు భావించారు. అయితే తాజాగా ధర్మాబాద్ కోర్టుకు వెళ్లకూడదనీ, దీనికి బదులుగా రీకాల్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించారు.ఈ కేసులో కోర్టుకు ఇప్పటికే హాజరైన మాజీ ఎమ్మెల్యేలు కేఎస్ రత్నం, ప్రకాష్ గౌడ్, గంగుల కమలాకర్‌లకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News