kaushal: కౌశల్ ప్లే బాయ్ కాదు .. బుద్ధిమంతుడే: నీలిమా కౌశల్

  • పెళ్లికి ముందే కౌశల్ తన గతం చెప్పాడు 
  • మాతో గడపడానికే ఆయనకి తీరిక వుండదు
  • ఆయనకి వేరే వ్యాపకాలేం లేవు      

'బిగ్ బాస్ 2' టైటిల్ గెలిచిన దగ్గర నుంచి కౌశల్ మరింత బిజీ అయ్యాడు. ఆయన బయటికి వస్తే చాలు .. అభిమానుల సందడి ఒక రేంజ్ లో కనిపిస్తూనే వుంది. ఈ నేపథ్యంలో భార్య నీలిమతో కలిసి తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడాడు. బిగ్ బాస్ హౌస్ లో కొంతమంది తనని ప్లే బాయ్ కేటగిరీలోకి చేర్చేయడం గురించి ఆయన ప్రస్తావించారు.

"గేమ్ లో భాగంగా ఒక అమ్మాయి చేయి పట్టుకుంటేనే నన్ను ప్లే బాయ్ అంటున్నారు. హౌస్ లో మిగతావాళ్లు హగ్గులు ఇచ్చుకున్నారు .. కిస్సులు పెట్టుకున్నారు .. ఒకరి మీద ఒకరు కూర్చోవడాలు చేశారు. మరి వాళ్లందరినీ ఏమనాలి? అయినా అమ్మాయి చేయి పట్టుకోవడానికి నేను బిగ్ బాస్ షోకి వెళ్లవలసిన అవసరం లేదు .. నేను వున్నదే మోడలింగ్ లో " అన్నారు.

అప్పుడు కౌశల్ గురించి నీలిమ స్పందిస్తూ .. " పెళ్లికి ముందు ఏమో గాని .. పెళ్లి అయిన తరువాత ఆయన బంగారమే. పెళ్లికి ముందే ఆయన తన గతం గురించి అంతా నాకు చెప్పారు. ఆయన ప్లే బాయ్ కాదు .. మాతో గడపడానికే ఆయనకి  సమయం దొరకదు .. అలాంటప్పుడు ఇక వేరే వ్యాపకాలేం ఉంటాయి" అని చెప్పుకొచ్చారు.    

kaushal
neelima
  • Loading...

More Telugu News