paruchuri: సమంత పాత్రను అక్కడ పరిచయం చేయడం కరెక్ట్ కాదు: పరుచూరి గోపాలకృష్ణ
- రాంగ్ టైమ్ లో సమంత ఎంట్రీ
- ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేదు
- ఆమె ఎంట్రీ అంతకుముందే జరగాల్సింది
ఈ వారం 'పరుచూరి పాఠాలు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, 'బ్రహ్మోత్సవం'లోని కొన్ని సన్నివేశాలను మరోలా కూడా మార్చవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సినిమాలో సమంత పాత్ర ఎంట్రీ గురించి ఆయన ప్రస్తావిస్తూ .. "సత్యరాజ్ పాత్ర చనిపోయి ఆ కుటుంబమంతా దుఃఖంలో ఉంటుంది. అలాంటి సమయంలో సమంత పాత్రను దింపారు. ఆ సమయంలో సమంత వచ్చేసి తనదైన స్టైల్లో గలగలా మాట్లాడుతూ వుంటే, దుఃఖంలో వున్న ఆడిటోరియం సమంత పాత్రను రిసీవ్ చేసుకోలేకపోయింది. అంతకుముందు టూర్ ఎపిసోడ్ వుంది కనుక .. అక్కడ సమంతను పరిచయం చేసేసి వుంటే బాగుండేది. అప్పుడున్న హ్యాపీ మూడ్ లో ఆడియన్స్ ఆమె పాత్రను రిసీవ్ చేసుకునే వాళ్లు. ఇక మరో చోట కూడా ఒక చుట్టం .. మరో చుట్టాన్ని కొడుతున్నట్టుగా చూపించారు .. మేము అలా రాయలేదు. ఈ విధంగా చూపించడం వలన, 'ఇలాంటి చుట్టాల కోసమా మనం వెతుక్కుంటూ వెళ్లాల్సింది' అని ఆడియన్స్ అనుకునే అవకాశం వుంది అని చెప్పుకొచ్చారు.