Lakshmi Parvati: ఎన్టీఆర్ వస్తే లోకేశ్ కు పోటీ అని చంద్రబాబుకు భయం: లక్ష్మీ పార్వతి

  • టీడీపీ కార్యకర్తల్లో ఎన్టీఆర్ కు ఫాలోయింగ్
  • ఆయనకు పార్టీ పదవి ఇస్తే ప్రతి ఒక్కరి మద్దతు
  • కుమారుడు సైడ్ అవుతాడని చంద్రబాబు భయం

నందమూరి అభిమానుల్లో, తెలుగుదేశం కార్యకర్తల్లో అపరిమితమైన ఫాలోయింగ్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ను చంద్రబాబునాయుడు కావాలనే పక్కన పెట్టాడని లక్ష్మీ పార్వతి ఆరోపించారు. లోకేశ్ కన్నా ఎన్టీఆర్ ఎన్నో రెట్లు ప్రతిభావంతుడని కితాబిచ్చిన ఆమె, ఎన్టీఆర్ వస్తే, తన కుమారుడు సైడ్ అయిపోవాల్సి వస్తుందన్న భయం చంద్రబాబులో ఉందని ఆరోపించారు.

 లోకేశ్ కు పోటీ వస్తాడన్న ఆలోచనతోనే ఎన్టీఆర్ ను తెరపైకి తేవడం లేదని ఆరోపించిన ఆమె, ఇప్పటికే ఓ నటుడిగా, వక్తగా ఎన్టీఆర్ నిరూపించుకున్నాడని అన్నారు. ఎన్టీఆర్ కు పార్టీ పదవి ఇస్తే, మొత్తం టీడీపీ నేతలంతా మద్దతిస్తారని తాను భావిస్తున్నానని, అయితే, అది జరిగే పరిస్థితులు మాత్రం తనకు కనిపించట్లేదని అన్నారు.

Lakshmi Parvati
NTR
Nara Lokesh
Chandrababu
  • Error fetching data: Network response was not ok

More Telugu News