geethanand: మరో ప్రేమకథా చిత్రంగా 'రథం' .. ఆసక్తిని రేకెత్తిస్తోన్న ట్రైలర్

  • యూత్ కి కనెక్ట్ అయ్యే ప్రేమకథ 
  • గ్రామీణ నేపథ్యంలో సాగే కథ 
  • లవ్ అండ్ యాక్షన్ కి పెద్దపీట    

తెలుగు తెరపై ప్రేమకథా చిత్రాలకు మంచి ఆదరణ ఉంటుంది. ఈ కారణంగానే విభిన్నమైన ప్రేమకథా చిత్రాలు ఇక్కడి ప్రేక్షకులను ఎక్కువగా పలకరిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే 'రథం' పేరుతో మరో ప్రేమకథా చిత్రం రూపొందింది. గీతానంద్ .. చాందిని నాయకా నాయికలుగా నటించిన ఈ సినిమాకి చంద్రశేఖర్ కానూరి దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ట్రైలర్ ను బట్టి .. ఇది గ్రామీణ నేపథ్యంలో కొనసాగే ప్రేమకథా చిత్రమని అర్థమవుతోంది. అమ్మాయి .. అబ్బాయి ప్రేమపక్షుల్లా విహరించడం .. పెద్దలు కట్టడి చేయడానికి ప్రయత్నించడం .. వాళ్లు ఎదిరించడం నేపథ్యంలో ఈ ట్రైలర్ ను కట్ చేశారు. "మంచివాడు పక్కింట్లో వుంటే మనోడ్రా అంటాం .. అదే వాడు మనింట్లో వుంటే ఇవన్నీ మనకెందుకురా అంటాం" అనే డైలాగ్ చాలా బాగుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. యూత్ కి ఈ సినిమా ఎంతవరకూ కనెక్ట్ అవుతుందో చూడాలి మరి.

  • Error fetching data: Network response was not ok

More Telugu News