Kurnool District: మాజీ మంత్రి మారెప్ప ఇంట్లో దొంగతనం!

  • పలు డాక్యుమెంట్లు, నగదును ఎత్తుకెళ్లిన చోరులు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన మారెప్ప
  • సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్న పోలీసులు

కర్నూలు జిల్లాలో దొంగలు ఏకంగా మాజీ మంత్రి మారెప్ప ఇంటినే టార్గెట్ చేసుకున్నారు. గత రాత్రి ఆయన ఇంట్లోకి చొరబడిన చోరులు ఇంట్లో ఉన్న రూ. 70 వేల నగదు, పలు డాక్యుమెంట్లను దొంగిలించుకుపోయారు. ఈ ఉదయం లేచిన తరువాత దొంగతనం జరిగిన విషయాన్ని గమనించిన మారెప్ప, త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నామని, దొంగలను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నామని తెలిపారు.

కాగా, ఈ సంవత్సరం మే వరకూ బీజేపీలో కొనసాగిన మారెప్ప, ఆ పార్టీకి రాజీనామా చేసి, తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఆపై కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన ప్రచారం చేశారు. రాయలసీమ ప్రాంతంలో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన ఆయన, గతంలో వైసీపీలోనూ కొంతకాలం పనిచేసిన సంగతి తెలిసిందే.

Kurnool District
Mareppa
Theft
Police
CCTV
  • Loading...

More Telugu News