sradha kapoor: అనారోగ్యంపాలైన శ్రద్ధా.. షూటింగ్‌కు బ్రేక్

  • సైనా బయోపిక్‌లో నటిస్తున్న శ్రద్ధా
  • వైద్య పరీక్షల్లో డెంగ్యూగా నిర్ధారణ
  • 27 నుంచి షూటింగ్‌కు బ్రేక్

సైనా నెహ్వాల్ బయోపిక్ కోసం బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ చాలా కాలంగా కసరత్తులు చేస్తోంది. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ కూడా ప్రారంభమైంది. కానీ ఆరోగ్యం సహకరించకపోవడంతో  ఈ ముద్దుగుమ్మ చిత్రీకరణకు సడెన్‌గా బ్రేక్ ఇచ్చింది. వైద్య పరీక్షల్లో శ్రద్ధాకు డెంగ్యూ సోకినట్టు తేలిందని బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

ప్రస్తుతం ఆమె డెంగ్యూ కోసం చికిత్స తీసుకుంటోందని కొన్ని రోజుల అనంతరం ఆమె తిరిగి చిత్రీకరణలో పాల్గొంటుందని ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక పేర్కొంది. ఆమె సెప్టెంబర్ 27 నుంచి షూటింగ్‌కు గైర్హాజరైందని సమాచారం. శ్రద్ధా మరికొద్ది రోజులపాటు చిత్రీకరణకు హాజరు కాలేకపోవచ్చు కాబట్టి దర్శకుడు అమోల్ గుప్తే... సైనా చిన్ననాటి సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది. శ్రద్దా చిత్రీకరణలో ఎప్పుడు పాల్గొనేది త్వరలోనే వెల్లడిస్తామని నిర్మాత భూషణ్ కుమార్ తెలిపారు.

sradha kapoor
Saina Nehwal
amole gupte
bhushan kumar
  • Loading...

More Telugu News