chintamaneni prabhakar: పవన్‌పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసిన చింతమనేని

  • కన్నెర్ర జేసుంటే పవన్ మీటింగ్ పెట్టేవాడు కాడు
  • బీజేపీ తోలుబొమ్మలాట ఆడిస్తోంది
  • టీడీపీలో ఉన్నందున సంయమనంతో ఉన్నా

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను కన్నెర్ర జేసుంటే పవన్ దెందులూరులో మీటింగ్ పెట్టేవాడు కాడంటూ వ్యాఖ్యానించారు. తన రౌడీయిజం పేదవాడి సమస్యల పరిష్కారం కోసమేనని స్పష్టం చేశారు.

పవన్, జగన్‌లతో బీజేపీ తోలుబొమ్మలాట ఆడిస్తోందని చింతమనేని విమర్శించారు. విద్వేషాలు రెచ్చగొట్టి కులపిచ్చిని తీసుకురావాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ కుటుంబంలో ఉన్నందున తాను సంయమనంతో ఉన్నానని చింతమనేని స్పష్టం చేశారు.

chintamaneni prabhakar
pavan kalyan
Jagan
BJP
Telugudesam
  • Loading...

More Telugu News