shafkhat amanath ali: మహాత్మునికి ఇష్టమైన పాట.. పాక్ గాయకుని నోట!

  • ‘వైష్ణవ్ జనతో’ను ఆలపించిన పాక్ గాయకుడు
  • గాంధీజీ జయంతి సందర్భంగా ప్రదర్శన
  • భారత్‌తోపాటు పాల్గొన్న ప్రపంచ దేశాలు

ఆయన పాట ఎందరి హృదయాలనో కదిలించింది. 124 దేశాల కళాకారులకు రావల్సిన పేరు ప్రతిష్టంతా ఆయన ఒక్కరికే సొంతమైంది. భారత్, పాకిస్థాన్ ఇరు దేశాలూ ప్రశంసలతో ముంచెత్తాయి. ఆయన ఎవరో కాదు... పాక్ గాయకుడు షఫ్‌ఖత్ అమనత్ అలీ. ఇంతకీ ఆయన పాడింది ఏ పాప్ సాంగో కాదు. ప్రముఖ భజన గీతం ‘వైష్ణవ్ జనతో’. మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ఆయన ఈ గీతాన్ని ఆలపించారు. ఈ వేడుకల్లో భారత్‌తో పాటు వివిధ ప్రపంచ దేశాలు పాల్గొన్నాయి.

అలీ అద్భుత ప్రదర్శన చేసిన వీడియోను ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌‌ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసింది. ఈ వీడియోను ఇప్పటికే చాలా మంది వీక్షించారు. ఎంతో మంది షేర్‌ చేశారు.  భారత విదేశాంగ శాఖ అభ్యర్థన మేరకు ప్రపంచ దేశాల్లోని కళాకారులు మహాత్మునికి ఇష్టమైన భక్తిగీతాన్ని ఆలపించేందుకు ముందుకు వచ్చారు. కానీ అలీ పాట ఎందరి హృదయాలనో బాగా ఆకట్టుకుంది. ఆయన భక్తితో, శ్రద్ధతో ఆలపించారని నెట్టింట్లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

shafkhat amanath ali
pak singer
bharath
mahatma gandhi
vaishnav janatho
  • Loading...

More Telugu News