gold: రూ.250 తగ్గిన బంగారం ధర

  • రూ.250 తగ్గి రూ.31,850కు చేరింది
  • కిలోకు రూ.100 తగ్గిన వెండి
  • డిమాండ్ తగ్గడమే కారణం

గత రెండు రోజులుగా పెరుగుతూ వస్తున్న పసిడి ధర నేడు భారీగా పడిపోయింది. దీంతో నేటి ట్రేడింగ్‌లో స్వచ్ఛమైన బంగారం ధర రూ.250 తగ్గి రూ.31,850కు చేరుకుంది. బంగారం బాటలోనే పయనించిన వెండి కిలోకు రూ.100 తగ్గి రూ.39,250కి చేరుకుంది.

అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన పరిస్థితులు, స్థానిక వ్యాపారుల నుంచి డిమాండ్‌ తగ్గడమే బంగారం ధర పతనానికి కారణమైందని ట్రేడింగ్ వర్గాలు వెల్లడించాయి. న్యూఢిల్లీలో స్వచ్ఛమైన పసిడి ధర రూ.250 తగ్గి రూ.31,850కి చేరుకోగా 99.5 నాణ్యత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.31,700గా ఉంది. అంతర్జాతీయంగా బంగారం ధర 0.16శాతం తగ్గి ఔన్సు 1,199.40డాలర్లు పలికింది. వెండి కూడా 0.03 శాతం తగ్గి ఔన్సు 14.64 డాలర్లకు చేరింది.

  • Loading...

More Telugu News