vijaya shanthi: నాడు విజయశాంతికి దొర అన్న పదం గుర్తుకురాలేదా?: గుండు సుధారాణి ఫైర్
- నేడు సంపాదన పథకాలుగా కనిపిస్తున్నాయా?
- చేనేత కార్మికులకు ఉపాధి కోసం బతుకమ్మ చీరలు
- ప్రాజెక్టులను కూడా అడ్డుకుంటున్నారు
'ప్రభుత్వ పథకాలు నేడు సంపాదన పథకాలుగా కనిపిస్తున్నాయా?' అని టి.కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతిపై టీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు గుండు సుధారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు రాఖీ కట్టిన సమయంలో విజయశాంతికి దొర అనే పదం గుర్తుకురాలేదా? అని మండిపడ్డారు.
చేనేత కార్మికులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని ఆమె తెలిపారు. అలాంటి కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ అడ్డుకుందని... ఈ విషయంలో విజయశాంతి తన స్టాండ్ ఏంటో వెల్లడించాలని సుధారాణి డిమాండ్ చేశారు. రైతులకు మేలు చేసే ఉద్దేశంతో ప్రాజెక్టులు కడుతుంటే వాటిని కూడా అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కోర్టుల్లో కేసులు వేస్తోందని ఆరోపించారు.