nara rohith: 'వీర భోగ వసంత రాయలు' రిలీజ్ డేట్ ఖరారు

  • డిఫరెంట్ కాన్సెప్ట్ తో క్రైమ్ థ్రిల్లర్ 
  • విభిన్నమైన పాత్రలో శ్రియ 
  • ఈ నెల 26వ తేదీన విడుదల    

ఇంద్రసేన దర్శకత్వంలో 'వీర భోగ వసంత రాయలు' సినిమా రూపొందింది. బెల్లన అప్పారావు నిర్మించిన ఈ సినిమాలో, నారా రోహిత్ .. సుధీర్ బాబు .. శ్రీవిష్ణు .. శ్రియ ప్రధానమైన పాత్రలను పోషించారు. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలను పోషించిన వాళ్లందరూ కూడా విభిన్నమైన లుక్స్ తో కనిపించనున్నారు.

ఈ సినిమాను ఈ నెల 19వ తేదీన విడుదల చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఈ నెల 26వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చారు. ఈ తేదీని ఖరారు చేస్తూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో నిర్మితమైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ప్రభావితం చేస్తుందో చూడాలి.    

  • Error fetching data: Network response was not ok

More Telugu News