Virat Kohli: కొప్పుల కొట్లాట.. విరాట్ కోహ్లీ-శిఖర్ ధావన్ భార్యల మధ్య గొడవ!

  • భారత్ లో పర్యటిస్తున్న వెస్టిండిస్ జట్టు
  • శిఖర్ కు తుది జట్టులో దక్కని చోటు
  • అనుష్కతో మాట్లాడని ఫ్రెండ్ ఆయేషా

సాధారణంగా ఆటగాళ్ల భార్యలు ఒకరితో మరొకరు స్నేహంగా ఉంటారు. కబుర్లతో పాటు షాపింగ్ కు కలిసి వెళుతుంటారు. స్టేడియంలోని స్టాండ్స్ లో కూర్చుని తమ జట్టును ఉత్సహపరుస్తుంటారు. కానీ కొన్నికొన్నిసార్లు మాత్రం అర్థంలేని చిన్నచిన్న కారణాలతో గొడవపడుతుంటారు. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ, ఓపెనర్ శిఖర్ ధావన్ భార్య ఆయేషాల మధ్య అలాంటి కోల్డ్ వారే నడుస్తున్నట్లు సమాచారం.

తాజాగా వెస్టిండీస్ తో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ధావన్ కు విశ్రాంతి ఇచ్చి పృథ్వీ షాను తీసుకోవడంతో ధావన్ భార్య ఆయేషా విరాట్-అనుష్క దంపతులపై అకారణంగా ద్వేషం పెంచుకుందని వార్తలు వస్తున్నాయి. నిన్నమొన్నటి వరకూ మంచి స్నేహితులుగా ఉన్న అనుష్క-ఆయేషాలు ఇప్పుడు కనీసం మాట్లాడుకోవడం లేదనీ, ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారని కథనాలు వచ్చాయి. అయితే దీనికి ఆయేషా స్పందిస్తూ అలాంటి గొడవేమీ లేదనీ, తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని స్పష్టం చేసింది. కాగా, ఈ వార్తలపై అనుష్క శర్మ ఇంకా స్పందించలేదు.

Virat Kohli
Anushka Sharma
sikhar dhawan
ayesha
fight
India
west indies
Cricket
Crime News
  • Loading...

More Telugu News