TTD: శ్రీవారి ఆర్జిత సేవ జనవరి 2019 కోటా టికెట్లు విడుదల

  • 68,575 టికెట్లు అందుబాటులో ఉంచినట్లు ఈఓ ప్రకటన
  • ఆన్‌లైన్‌ డిప్‌లో 7,125 టికెట్లు
  • 13,775 కల్యాణం టికెట్లు

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆర్జిత సేవా టికెట్లు విడుదలయ్యాయి. 2019 జనవరి నెల కోటాలో భాగంగా మొత్తం 68,575 టికెట్లు ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ విడుదల చేశారు. వీటితోపాటు ఆన్‌లైన్‌ డిప్‌ ద్వారా మరో 7,125 టికెట్లు అందుబాటులో ఉంచారు. సుప్రభాత సేవ 4,425, తోమాల-అర్చన 160, అష్టాదళ పద్మారాధన 240, నిజపాద దర్శనం 2,300 టికెట్లను భక్తుల కోసం అందుబాటులో ఉంచారు. వీటితోపాటు రెండువేల విశేష పూజా టికెట్లు, 13,775 కల్యాణం టికెట్లు, ఊంజల్‌ సేవవి 4,350, ఆర్జిత బ్రహ్మోత్సవం 7,979, వసంతోత్సవం 15,950, సహస్ర దీపాలంకరణ సేవకు 17,400 టికెట్లను అందుబాటులో ఉంచినట్లు ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు.

TTD
seva tickets
  • Loading...

More Telugu News