Andhra Pradesh: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. 2684 పోలీసు ఉద్యోగాల భర్తీకి ఈ నెలలో నోటిఫికేషన్‌

  • కసరత్తు ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
  • 2500 ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి
  • ఐదు నెలల వ్యవధిలో ప్రక్రియ పూర్తికి నిర్ణయం

పోలీసు శాఖలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. భారీ స్థాయిలో ఖాళీల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. దాదాపు 2684 పోస్టుల భర్తీకి ఈ నెలలోనే నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

పోలీసు శాఖలో 2500 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడంతో పోలీసు నియామక మండలి అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతోంది. మినిస్టీరియల్‌ విభాగంలో మరో 184 పోస్టుల భర్తీకి తాజాగా ప్రతిపాదనలు పంపింది. వీటికి కూడా అనుమతి మంజూరైతే నిరుద్యోగులకు ఇదో సువర్ణావకాశమే. 2016లో ఒకసారి ప్రభుత్వం భారీ స్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేసింది. అప్పటి భర్తీ ప్రక్రియ విధానాన్నే ఈసారీ అనుసరించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Andhra Pradesh
Police
recruitment
  • Loading...

More Telugu News