Vijayawada: విజయవాడకు చేరుకున్న ఐటీ అధికారుల బృందాలు.. నేడు పలు దాడులు?

  • ప్రముఖ హోటల్ లో బస చేసిన ఐటీ అధికారులు
  • నేడు పలువురి ఇళ్లలో సోదాలు చేసే అవకాశం
  • నిన్న టీడీపీ నేత మస్తాన్ రావు కంపెనీల్లో సోదాలు

"ఆంధ్రప్రదేశ్ లోని పలువురు మంత్రులు, పెద్దలపై ఐటీ దాడులు జరగనున్నాయి" నిన్న చంద్రబాబు చేసిన వ్యాఖ్యలివి. ఇవి నిజం కావచ్చనిపిస్తోంది ఇప్పుడు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఐటీ అధికారుల బృందాలు విజయవాడకు చేరుకున్నాయి. నగరంలోని ఓ ప్రముఖ హోటల్ లో బస చేసిన ఐటీ అధికారులు, నేడు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రముఖుల ఇళ్లలో సోదాలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.

నిన్న నెల్లూరు టీడీపీ నేత మస్తాన్ రావు కంపెనీల్లో ఐటీ అధికారులు సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. నేడు విజయవాడలోని కొందరు రాజకీయ ప్రముఖుల ఇళ్లపై కూడా ఐటీ దాడులు జరిగే అవకాశం ఉందని సమాచారం. తమకు సహకరించేందుకు పోలీసులు సిద్ధంగా ఉండాలని రెండు రోజుల క్రితమే కేంద్ర ఐటీ శాఖ నుంచి ఆదేశాలు అందినట్టు పోలీసు వర్గాలు అంటున్నాయి. ఐటీ దాడుల వార్తలతో రాజకీయ నేతలు, ప్రముఖులు ఆందోళన చెందుతున్నారు.

Vijayawada
IT
Searchings
Politicle Leaders
  • Loading...

More Telugu News