Rashmika: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • అలాంటి సినిమాలు చేయనంటున్న రష్మిక 
  • 'శభాష్ నాయుడు' మొదలెట్టనున్న కమల్
  • చివరి షెడ్యూలులో నిఖిల్ 'ముద్ర'  

*  ఏమాత్రం ప్రాధాన్యత లేని సినిమాలు చచ్చినా చేయను అంటోంది 'గీతగోవిందం' చిత్రం ద్వారా మంచి పేరు తెచ్చుకున్న కథానాయిక రష్మిక మందన. 'నటనకు అవకాశం లేని పాత్రలను, కథలో ప్రాధాన్యం లేని పాత్రలను ఒప్పుకోకూడదని నిర్ణయించుకున్నాను. కథలో నా పాత్రకు తగిన గుర్తింపు వుండాలి. అలాంటి సినిమాలే చేస్తాను' అని చెప్పింది రష్మిక.
*  కొన్నాళ్ల క్రితం ప్రముఖ నటుడు కమలహాసన్ స్వీయ దర్శకత్వంలో 'శభాష్ నాయుడు' పేరిట ఓ చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. కొంత షూటింగ్ జరిగిన తర్వాత ఈ చిత్రం ఆగిపోయింది. ఇప్పుడు త్వరలో దీని షూటింగును తిరిగి ప్రారంభించడానికి కమల్ ప్రయత్నాలు చేస్తున్నాడట. ఇందులో కమల్ తో పాటు శ్రుతి హాసన్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం కూడా నటిస్తున్నారు.
*  తమిళ దర్శకుడు టీఎన్ సంతోష్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా రూపొందుతున్న 'ముద్ర' చిత్రం తాజా షెడ్యూల్ షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది. ఇది పూర్తవగానే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభిస్తారు. ఇందులో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. 

Rashmika
Kamal Haasan
Shruti
Ramyakrishna
  • Loading...

More Telugu News