Pawan Kalyan: పవన్.. మీరే పార్టీ కోసం ప్రచారం చేస్తున్నారు?: మంత్రి కేఎస్ జవహర్

  • పవన్ ప్రచారం ఏ పార్టీని గెలిపించేందుకో..
  • నాడు పంచెలూడదీసి పరిగెట్టిస్తామన్నారు
  • ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్‌కు అమ్మేశారు

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ మంత్రి కేఎస్ జవహర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లాలోని బోడపాడులో నిర్వహించిన గ్రామ దర్శినిలో ఆయన మాట్లాడారు. పవన్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు. ఆయన అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని పెట్టినప్పుడు పవన్ యువజన నాయకుడిగా ఉన్నారని గుర్తు చేశారు.

అప్పుడోసారి ప్రచారంలో పంచెలూడదీసి పరిగెట్టిస్తామని కాంగ్రెస్ నేతలను పవన్ హెచ్చరించారని గుర్తు చేశారు. ఎన్నికల తర్వాత ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్‌కు అమ్మేశారని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం పవన్ ఏ పార్టీని గెలిపించేందుకు తాపత్రయపడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ మద్దతుతోనే మాణిక్యాలరావు గత ఎన్నికల్లో గెలిచారని, ఈసారి వార్డు సభ్యుడిగా కూడా గెలవలేరని మంత్రి జవహర్ ఎద్దేవా చేశారు.

Pawan Kalyan
KS Jawahar
Andhra Pradesh
Janasena
Praja Rajyam
Congress
  • Loading...

More Telugu News