Rita banarval: భారతీయ అమెరికన్‌ను కీలక పదవికి ఎంపిక చేసిన ట్రంప్
- జీఏఐఎన్‌లో డైరెక్టర్‌గా పనిచేస్తున్న రిటా బనర్వాల్
- అణుశక్తిశాఖ అసిస్టెంట్ సెక్రటరీగా నియామకం
- అణుశాస్త్రంలో రిటా నిపుణురాలు
బరన్వాల్ గేట్‌వే ఫర్ ఆక్సిలరేటెడ్ ఇన్నోవేషన్ ఇన్ న్యూక్లియర్ (జీఏఐఎన్)లో డైరెక్టర్‌గా పనిచేస్తున్న భారతీయ అమెరికన్‌కు అరుదైన గౌరవం లభించింది. రిటా బనర్వాల్ అనే భారతీయ అమెరికన్‌ను ఎనర్జీ విభాగంలోని అణుశక్తిశాఖ అసిస్టెంట్ సెక్రటరీగా నియమించారు. స్వయంగా అమెరికన్ అధ్యక్షుడు ట్రంప్.. రిటాను ఎంపిక చేయడం విశేషం. ఎనర్జీ విభాగ అసిస్టెంట్ సెక్రటరీగా నియమించే ట్రంప్ ప్రతిపాదనను సెనెట్ ఆమోదించాల్సి ఉంది.
అనంతరం ఆమెకు అణు సాంకేతికత పరిశోధన, అభివృద్ధి, నిర్వహణ వంటి అదనపు బాధ్యతలూ దక్కుతాయి. అమెరికా ఆధునిక అణు రియాక్టర్ల అభివృద్ధిని వేగవంతం చేయాలని నిర్ణయించిన కొద్ది రోజుల్లోనే ట్రంప్ ఆ దిశగా చర్యలు వేగవంతం చేశారు. అణు శాస్త్రంలో రీటా నిపుణురాలు. మెటీరియల్ సైన్స్, ఇంజినీరింగ్‌లో ఎంఐటీ నుంచి పట్టా పొందారు. మిచిగన్ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ అందుకున్నారు.