kavya reddy: కూకట్ పల్లి మాజీ ఎమ్మెల్యే కృష్ణారావుపై కావ్య రెడ్డి తీవ్ర విమర్శలు

  • నిధులను దారి మళ్లించి తన భవనాలకు రోడ్లు వేయించుకున్నారు
  • నన్ను రాజీనామా చేయమనే హక్కు ఆయనకు లేదు
  • భూకబ్జాలపై బహిరంగ చర్చకు సిద్ధమేనా?

హైదరాబాద్ కూకట్ పల్లి నియోజకవర్గ టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుపై కార్పొరేటర్ కావ్య రెడ్డి మండిపడ్డారు. ఒకే పార్టీలో ఉన్నా తమపై అక్రమ కేసులు బనాయించారని దుయ్యబట్టారు. బాలాజీనగర్ డివిజన్ అభివృద్ధిని అడ్డుకున్నారని... నిధులను దారి మళ్లించి తన భవనాలకు రోడ్లు వేయించుకున్నారని ఆరోపించారు.

భూకబ్జాలపై బహిరంగ చర్చకు కృష్ణారావు సిద్ధమేనా? అని సవాల్ విసిరారు. ప్రజాసమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తే పట్టించుకోవద్దని ఆదేశించారని మండిపడ్డారు. టీడీపీ టికెట్ మీద గెలిచి టీఆర్ఎస్ లో చేరిన కృష్ణారావుకు తనను రాజీనామా చెయ్యమనే హక్కు లేదని... తాను టీఆర్ఎస్ టికెట్ పై గెలిచి, అదే పార్టీలో కొనసాగుతున్నానని చెప్పారు.

kavya reddy
madhavaram krishna rao
kukatpalli
TRS
  • Loading...

More Telugu News