balakrishna: ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం టైటిల్ 'ఎన్టీఆర్ మహానాయకుడు'!

- సినిమా వైభవంతో 'కథానాయకుడు'
- రాజకీయ ప్రయాణంతో 'మహానాయకుడు'
- ఒకే నెలలో రెండు సినిమాల విడుదల
క్రిష్ దర్శకత్వంలో 'ఎన్టీఆర్' బయోపిక్ రూపొందుతోంది. ఎన్టీఆర్ గా బాలకృష్ణ ప్రధానపాత్రను పోషిస్తోన్న ఈ సినిమా, భారీ బడ్జెట్ తో నిర్మితమవుతోంది. హీరోగా .. రాజకీయనాయకుడిగా ఎన్టీఆర్ సుదీర్ఘమైన ప్రస్థానాన్ని కొనసాగించారు. అందువలన రెండున్నర గంటల్లో ఆయన జీవిత చరిత్రను చెప్పడం కష్టమని క్రిష్ భావించినట్టుగా వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ సినిమా జీవిత వైభవాన్ని ఒక భాగంగా .. రాజకీయ ప్రస్థానానికి సంబంధించిన ప్రయాణాన్ని ఒక భాగంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువెళదామనే అభిప్రాయాన్ని ఆయన బాలకృష్ణ దృష్టికి తీసుకువెళ్లగా గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.
