priyanka chopra: డేటింగ్ యాప్ లో పెట్టుబడి పెట్టనున్న ప్రియాంకచోప్రా

  • బంబుల్ డేటింగ్ యాప్ లో పెట్టుబడి
  • త్వరలోనే భారత్ లో ప్రవేశించనున్న యాప్
  • చాలా సంతోషంగా ఉందన్న ప్రియాంక

నటిగా, గాయనిగా, నిర్మాతగా విజయవంతమైన బాలీవుడ్ భామ ప్రియాంకచోప్రా కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టబోతోంది. 'బంబుల్' అనే డేటింగ్ యాప్ లో ఆమె పెట్టుబడి పెట్టనుంది. ఇటీవలే యూఎస్ కోడింగ్ స్కూల్ అనే సంస్థలో ప్రియాంక పెట్టుబడి పెట్టింది. ఈ సందర్భంగా... 'ఇది నా జీవితంలో కొత్త అధ్యాయం. లింగ వివక్ష లేకుండా మెరుగైన సమాజం కోసం తమ వ్యాపారాలను విస్తరిస్తున్న రెండు కంపెనీలతో కలసి పని చేస్తున్నందుకు సంతోషంగా ఉంది' అని ప్రియాంక తెలిపింది. బంబుల్ డేటింగ్ యాప్ భారత్ లో ప్రవేశించనుంది. ఈ యాప్ ద్వారా మొదట చాట్ చేసే అవకాశం మహిళలకే ఉంటుంది.

priyanka chopra
bumble app
investment
bollywood
  • Loading...

More Telugu News