amzon: మార్కెట్ రారాజు యాపిల్.. అత్యుత్తమ బ్రాండ్ గా ఎంపిక!
- టాప్-100 జాబితా విడుదలచేసిన ఇంటర్ బ్రాండ్
- సెర్చింజన్ దిగ్గజం గూగుల్ కు రెండో స్థానం
- టాప్-10లో మెక్ డొనాల్డ్స్ కు చోటు
టెక్నాలజీ దిగ్గజం యాపిల్ తయారుచేసే ఐఫోన్ ఈ ఏడాదికి గానూ అత్యుత్తమ బ్రాండ్ గా అగ్రస్థానంలో నిలిచింది. ప్రముఖ సెర్చింజన్ గూగుల్ రెండో స్థానానికి పరిమితమయింది. ఈ మేరకు ప్రముఖ బ్రాండ్ కన్సల్టింగ్ సంస్థ ‘ఇంటర్ బ్రాండ్’ టాప్-100 ఉత్తమ గ్లోబల్ బ్రాండ్స్ జాబితాను ఈ రోజు విడుదల చేసింది. ఈ జాబితాలో ఆన్ లైన్ మార్కెటింగ్ కంపెనీ ‘అమెజాన్’ మూడోస్థానంలో నిలిచింది. కాగా, ఇటీవల వరుస వివాదాల్లో చిక్కుకున్న సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ ఏకంగా 9వ స్థానానికి పడిపోయింది.
ఇక మైక్రోసాఫ్ట్ కంపెనీ నాలుగో స్థానంలో, కోకాకోలా సంస్థ ఐదో స్థానంలో నిలిచినట్లు ఇంటర్ బ్రాండ్ తెలిపింది. వీటితో పాటు శామ్ సంగ్(6), టొయోటా(7), బెంజ్(8), ఫేస్ బుక్(9), మెక్ డొనాల్డ్స్(10) బ్రాండ్లు టాప్-10లో చోటు దక్కించుకున్నాయని వెల్లడించింది.