mla chintamaneni: ఎమ్మెల్యే చింతమనేనిని అరెస్ట్ చేయకపోతే ఆందోళనలు చేపడతాం: సీపీఐ రామకృష్ణ

  • ఎమ్మెల్యేలు రౌడీలుగా మారిపోతున్నారు
  • ఏపీలో శాంతిభద్రతలు విఫలమయ్యాయి
  • కిడారి, సోమ హత్యలకు చంద్రబాబే బాధ్యత వహించాలి

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేయకపోతే ఏపీ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని సీపీఐ నేత రామకృష్ణ హెచ్చరించారు. విజయవాడలో చింతమనేని అనుచరుడు పోలీసులపై దాడి చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఎమ్మెల్యేలు రౌడీలుగా మారిపోతున్నారని ఆరోపించారు. అనంతపురంలో పోలీసులను టీడీపీ ఎంపీ దూషిస్తే ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఈ సందర్భంగా ఏపీలో శాంతిభద్రతలు విఫలమయ్యాయని, హోం మంత్రి చినరాజప్ప ‘డమ్మీ మినిస్టర్’ అని వ్యాఖ్యలు చేశారు. కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమ హత్యలకు సీఎం చంద్రబాబే బాధ్యత వహించాలని రామకృష్ణ అన్నారు.

mla chintamaneni
cpi ramakrishna
  • Loading...

More Telugu News