kaushal: కౌశల్ ను గెలిపించాలనే కసి అప్పటి నుంచే అందరిలో మొదలైంది: కౌశల్ తండ్రి

  • సీజన్ మొత్తానికి ఎలిమినేట్ చేశారు 
  • అభిమానులే గట్టెక్కిస్తూ వచ్చారు 
  • వాళ్ల కారణంగానే టైటిల్ దక్కింది    

'బిగ్ బాస్ 2'లో ప్రతి టాస్క్ లోను కౌశల్ మంచి నైపుణ్యాన్ని కనబరిచాడు. మిగతా వాళ్లంతా తనని ఒంటరివాడిని చేయడం పట్ల అసహనాన్ని వ్యక్తం చేస్తూనే, తెలివిగా గేమ్ ఆడుతూ వచ్చాడు. ఎంతో ఓర్పును చూపిస్తూ అందరి అభిమానంతో పాటు టైటిల్ ను గెలుచుకున్నాడు. 'బిగ్ బాస్ హౌస్'లో కౌశల్ గురించి ఆయన తండ్రి సుందరయ్య తాజా ఇంటర్వ్యూలో స్పందించారు.

"ఎప్పుడైతే గీతామాధురి సీజన్ మొత్తానికి గాను కౌశల్ ను ఎలిమినేట్ చేసిందో, అప్పటి నుంచే అందరిలోను కౌశల్ ను ఎలాగైనా కాపాడాలి .. గెలిపించాలి అనే కసి పుట్టింది. అలా కౌశల్ ఎలిమినేషన్లో వున్నన్ని రోజులు అభిమానులే వాడిని ఎలిమినేషన్ నుంచి తప్పిస్తూ వచ్చారు. మా స్నేహితులు .. సన్నిహితులు మాత్రమే కాదు, మాకు తెలియని ఎంతోమంది ఓట్లు వేశారు. టౌన్లు .. పట్టణాల్లో వున్న వాళ్లు మాత్రమే కాదు .. గ్రామీణ ప్రాంతాలకి చెందిన వాళ్లు కూడా అత్యధిక సంఖ్యలో ఓట్లు వేశారు. వాళ్లందరి అభిమానం కారణంగానే కౌశల్ టైటిల్ ను సొంతం చేసుకున్నాడు" అని చెప్పుకొచ్చారు.    

  • Loading...

More Telugu News