serial rapist: సీరియల్ రేపిస్ట్.. 17 మంది బాలికలపై అత్యాచారం చేసిన మృగాడు!

  • నిర్మాణ భవంతుల వద్ద మైనర్లే లక్ష్యం
  • ట్రాప్ చేసి లైంగికదాడి
  • నాలుగు జిల్లాల్లో అఘాయిత్యాలు

మైనర్ బాలికలు లక్ష్యంగా అత్యాచారాలకు పాల్పడుతున్న ఓ మానవ మృగాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని విచారించిన అధికారులు నిందితుడు చెప్పిన విషయాలు విని షాక్ కు గురయ్యారు. ఎందుకంటే సదరు ప్రబుద్ధుడు ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 17 మంది మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడినట్లు తేలింది. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో చోటుచేసుకుంది.

ముంబైలోని నాయనగర్ వుడ్ ల్యాండ్ సొసైటీలో ఖురేషీ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతను బిల్డర్లకు భవన నిర్మాణ సామగ్రిని సరఫరా చేస్తుంటాడు. ఈ సందర్భంగా నిర్మాణ భవంతుల వద్ద ఒంటరిగా ఉండే బాలికలను గుర్తించి ‘మీ నాన్న పిలుస్తున్నాడు’ అంటూ పక్కకు తీసుకెళ్లేవాడు. అనంతరం అత్యాచారానికి పాల్పడేవాడు. ఇలా నవీ ముంబై, థానే, థానే గ్రామీణం, పాల్ఘర్ జిల్లాల్లో 17 మంది చిన్నారులపై తన మృగవాంఛను తీర్చుకున్నాడు.

ఈ దారుణానికి  పాల్పడేటప్పుడు తన లొకేషన్ ను పోలీసులు గుర్తుపట్టకుండా ఫోన్ ను స్విచ్ఛాప్ చేసేవాడు. కొందరు బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు పక్కా సమాచారంతో ఖురేషీని అరెస్ట్ చేశారు. ఇతనిపై కేసులను విచారించేందుకు ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టుతో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను నియమించాలని నవీముంబై కమిషనర్ నిర్ణయించారు. అలాగే దర్యాప్తు కోసం పోలీస్ అధికారులతో ప్రత్యేకంగా ఓ టీమ్ ను నియమించారు.

serial rapist
minors
mumbai
Maharashtra
khureshi
Police
arrest
  • Loading...

More Telugu News