sharukh khan: షారుక్ నా వల్లే సూపర్ స్టార్ అయ్యాడు.. ఆ తర్వాత నన్నే అవమానించాడు!: గాయకుడు అభిజీత్

  • షారుక్ కోసం చాలా పాటలు పాడా
  • కానీ కనీస గౌరవం దక్కలేదు
  • నేను తప్పుకోగానే షారుక్ ఫెయిల్ అయ్యాడు

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తన వల్లే సూపర్ స్టార్ అయ్యాడని ప్రముఖ గాయకుడు అభిజీత్ భట్టాచార్య తెలిపారు. తన సాయంతో పైకి ఎదిగిన షారుక్ తననే అవమానించాడని వెల్లడించారు. దీంతో షారుక్ సినిమాలకు పాడటాన్ని ఆపేశానని పేర్కొన్నారు. ముంబైలో జరిగిన ఓ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో అభిజీత్ మాట్లాడారు. తన గొంతు అచ్చం షారుక్ లా ఉందని చాలా మంది చెప్పేవారని షారుక్ అన్నారు.

తాను పాడుతున్నంత వరకూ షారుక్ ఖాన్ కెరీర్ దేదీప్యమానంగా వెలిగిపోయిందని అభిజీత్ భట్టాచార్య అన్నారు. ఒక్కసారి తాను పాడటం ఆపేయగానే కింగ్ ఖాన్ ఒక్కసారిగా డౌన్ అయిపోయాడని తెలిపారు. సినిమా అయిపోయాక ప్రేక్షకులు వెళ్లిపోతున్న వేళ తన పేరును స్క్రీన్ పై వేశారనీ, తెరపై తన పేరును అలా చూడాలనుకోవడం లేదని పేర్కొన్నారు. తనకు ఏమాత్రం మర్యాద ఇవ్వని వ్యక్తులతో కలిసి పనిచేయకూడదని అప్పుడే నిర్ణయించుకున్నానని అభిజీత్ చెప్పుకొచ్చారు.

sharukh khan
abhijeet bhattacharya
superstar
Bollywood
disrespect
  • Loading...

More Telugu News